Ram Charan | రెండుమూడేళ్లుగా ‘గేమ్‌చేంజర్’ సినిమాకే అంకితం అయిపోయారు రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రి పాత్ర పేరు అప్పన్న కాగా, కొడుకు పాత్ర పేరు రామ్నందన్ అని తెలుస్తున్నది. అప్పన్న పాత్ర పొలిటికల్ నేపథ్యంలో సాగితే, కొడుకు రామ్నందన్ పాత్ర లా అండ్ ఆర్డర్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం.
ఈ రెండు పాత్రలకూ జోడీలుగా అంజలి, కైరా అద్వానీ నటిస్తున్నారు. ఇదిలావుంటే ఈ సినిమాకోసం చాలాకాలంగా ఒకే లుక్‌ని మెయింటెన్ చేస్తూ వచ్చారు రామ్‌చరణ్. ఎట్టకేలకు ఈ శనివారంతో ‘గేమ్‌చేంజర్’ సినిమాకు సంబంధించిన రామ్‌చరణ్ వర్క్ కంప్లీట్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం. ఇక ‘గేమ్‌చేంజర్’ లొకేషన్‌కి గుడ్‌బై చెప్పేసి, బుచ్చిబాబు సాన సినిమాపై దృష్టిసారించనున్నారు రామ్‌చరణ్. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాకోసం ఆయన మేకోవర్ అవ్వాల్సివుంది. దాంతో ఆయన కొత్తలుక్‌లోకి రానున్నారు. జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటించనున్న విషయం తెలిసిందే.