Bollywood | ‘ఉప్పెన’ సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ దర్శకుడు బుచ్చిబాబు సనా. మొదటి సినిమాకే టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు చిన్న పాయింట్‌తో రెండు గంటల పాటు ప్రేక్షకులని కట్టిపడేసేలా చేశాడు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయిన బుచ్చిబాబు, ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించి విడుదలైన వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మూవీ హిట్ అనే అభిప్రాయానికి వచ్చేశారు ఫ్యాన్స్.
ఇక ‘పెద్ది’ తరువాత బుచ్చిబాబు తన కెరీర్లో మరో భారీ ప్రాజెక్ట్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా మైత్రి మూవీ మేకర్స్ తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, హిందీలో జాట్ సినిమాలు నిర్మించిన ఈ బ్యానర్, ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ క్రేజీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోందట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధులు షారుఖ్ ఖాన్‌ను కలిసి ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపి, ముందుగానే అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. దాదాపు ₹500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందట.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడానికి దర్శకుడిగా బుచ్చిబాబును ఎంపిక చేసినట్టు సమాచారం. ‘ఉప్పెన’ నుంచి ‘పెద్ది’ వరకు తన పనితీరుతో ఆకట్టుకున్న బుచ్చిబాబు.. షారూఖ్ లాంటి స్టార్‌ని డైరెక్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్ ఫైనల్ దశలో ఉంది. ఇది పూర్తయ్యాకే షారుఖ్ ఖాన్ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.మూడో సినిమాకే బుచ్చిబాబు షారుఖ్ ఖాన్‌తో పని చేసే అవకాశం రావడం నిజంగానే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించే విషయమే. ఇప్పుడు అందరి దృష్టి ఈ క్రేజీ మల్టీ-ఇండస్ట్రీ కోలాబరేషన్‌పై పడింది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బుచ్చిబాబు ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం అంటున్నారు.