Sajid Nadiadwala | యశ్‌తో కొత్త సినిమాలు..బాలీవుడ్ బడా నిర్మాత భారీ డీల్..?
కేజీఎఫ్ తో ఓవర్‌నైట్ పాన్ఇండియా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు యశ్. రీసెంట్గా మరోసారి కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF 2)తో ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాపీస్‌ను షేక్ చేస్తున్నాడు. నిర్మాతలకు కలెక్షన్ల పంట పండిస్తూ అగ్రనిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
యశ్ (Yash)..ఒకప్పుడు కన్నడ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన హీరో. కానీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కేజీఎఫ్ తో ఓవర్‌నైట్ పాన్ఇండియా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో యశ్‌కు దక్షిణాదితోపాటు నార్త్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. రీసెంట్గా మరోసారి కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF 2)తో ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాపీస్‌ను షేక్ చేస్తున్నాడు. నిర్మాతలకు కలెక్షన్ల పంట పండిస్తూ అగ్రనిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఈ క్రేజీ హీరోకు సంబంధించిన ఓ వార్త ఇపుడు సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు యశ్ తలుపు తడుతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ బడా నిర్మాత సాజిద్ నదియావాలా (Sajid Nadiadwala) కేజీఎఫ్ స్టార్ హీరో యశ్‌తో సినిమా..కాదు కాదు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడట. సాజిద్ నదియావాలా ఏకంగా యశ్‌తో మూడు చిత్రాలు (చేసేలా భారీ డీల్‌కు సెట్ చేసే సన్నాహాల్లో ఉన్నాడని బీటౌన్ సర్కిల్ టాక్.

ప్రస్తుతానికి దీనిపై అధికారిక అప్ డేట్ ఏమీ లేకున్నా..ఈ న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. మరోవైపు యశ్ కూడా ఇప్పటివరకు తన కొత్త సినిమా ఏంటో ప్రకటించలేదు. మరి రానున్న రోజుల్లో అన్నీ కుదిరితే అనుకున్నట్టుగానే సాజిద్ తోసినిమాలకు యశ్ సంతకం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ జనాలు. ఇటీవల కాలంలో బాలీవుడ్ (Bollywood )సినిమాలు ఆశించినంతగా సక్సెస్ కాలేకపోతున్నాయి.
Read Also : Jai Balayya Song | ‘జై బాలయ్య’ను స్పూర్తిగా తీసుకుంటున్న మహేశ్..నిజమెంత ?
ఎప్పుడూ మాట్లాడని బాలీవుడ్ హీరోలు కూడా దక్షిణాది సినిమాల (South films)తోపాటు వాటి హీరోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైనా సాజిద్ నదియావాలా యశ్‌తో భారీ డీల్ చేసుకోబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.
Read Also : Raveena Tandon | రవీనాపై కాయిన్ల వర్షం..వీడియో షేర్ చేసిన కేజీఎఫ్ నటి 2
Read Also : Mahesh Babu wishes | అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు..మహేశ్‌బాబు స్పెషల్ ట్వీట్ వైరల్
Read Also : Upasana Langar Seva | షూటింగ్లో రాంచరణ్ బిజీ..గోల్డెన్ టెంపుల్లో ఉపాసన పూజలు..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

