మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న (NTR) ఎన్టీఆర్-కొరటాల శివ (Koratala Siva) క్రేజీ కాంబినేషన్‌పై అప్ డేట్ వచ్చేసింది. కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ 30 (NTR30) వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి తొలి వారంలో గ్రాండ్‌గా లాంఛ్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో అలియాభట్ (Alia Bhatt ) కనిపించనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ తాజా అప్ డేట్ వచ్చింది.
అలియాభట్ ఫైనల్‌గా ఈ చిత్రానికి సైన్ చేసింది. కొరటాల ఈ సారి కొత్త సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పనిచేయబోతున్నాడని టాక్. అలియాభట్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్ఆర్ఆర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోఅలియా భట్ మాత్రం రాంచరణ్‌కు జోడీగా నటించింది. ఎన్టీఆర్‌తో కలిసి అలియాభట్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. #NTR30 రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే షురూ కానుంది.
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కల్యాణ్‌తో మ్యూజిక్ కంపోజ్ చేసిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత అనిరుధ్ తెలుగులో చేస్తున్న పెద్ద చిత్రమిదే. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రంలో ఎన్టీఆర్ కొమ్రం భీంగా నటిస్తున్నాడు. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాంచరణ్ నటిస్తుండగా..అలియాభట్ సీత పాత్ర పోషిస్తోంది.
ఒలివియా మొర్రీస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాడు తారక్.