KTR Comments On Devara Event | దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. కనీసం ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థత పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది అంటూ నిప్పులు చెరిగారు. మా ప్రభుత్వ హాయంలో గణేష్ నిమజ్జనం కావచ్చు, మొహర్రం ఊరేగింపు కావచ్చు, బోనాల పండుగ కావచ్చు ఇలా అన్ని రకాల పండుగలతో పాటు ఈవెంట్లను శాంతియుతంగా చేసాము. ఫార్మూలా వన్ లాంటి పెద్ద ఈవెంట్లను కూడా చిన్న అంతరాయం కలగకుండా చేశాం. చివరికి సినిమాలకు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసిన ఘనత మా ప్రభుత్వానిది.
కానీ ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో మీరే చూడండి. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా. ఆయన ఇక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా నిర్వహించేలేని అసమర్థత. అలాంటి పరిస్థితిలోకి ఈ నగరం వెళ్ళిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. కాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Jr ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి – కేటీఆర్ pic.twitter.com/0I8CGXVEjt
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024