తెలుగుసినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాతో రాజమౌళి, తారక్, రామ్‌చరణ్‌లు గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్ అవార్డులతోపాటు జాతీయ అవార్డుల్లో కూడా సత్తా చాటింది ‘ఆర్ఆర్ఆర్’. వసూళ్ల పరంగా కూడా దేశంలోనే థర్డ్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇదిలావుంటే.. బ్రెజిల్ అధ్యక్షకుడు లూయిజ్ ఇనాసియో లూలడసిల్వ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ-“ఆనాటి బ్రిటీష్ నిరంకుశత్వంపై ఘాటైన విమర్శలే చేసినా, అర్థవంతంగా చూపించారు దర్శకుడు.
అద్భుతమైన సన్నివేశాలు, అబ్బురపచిచే డ్యాన్సులు మూడు గంటలు ఎంజాయ్ చేశాను” అంటూ చిత్ర యూనిట్‌ని ప్రశంసించారు. కాగా, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కూడా లూయిజ్ ప్రశంసకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’పై బ్రెజిల్ అధ్యక్షుని ప్రశంస ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది.