Brahmanandam | టాలీవుడ్ యాక్టర్ మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరైన వారిలో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందంతోపాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఉన్నారు.
అయితే ఈవెంట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ఫొటో దిగుదామని బ్రహ్మీని చేయి పట్టుకుని అడిగారు. ఈ క్రమంలో బ్రహ్మానందం కొంచెం (సరదాగా) ఎర్రబెల్లి దయాకర్‌రావును లెక్కచేయనట్టుగా నో చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఎర్రబెల్లితో ఫొటో దిగేందుకు బ్రహ్మానందం నో చెప్పారంటూ కామెంట్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం స్పందించారు.
నేను ఉదయాన్నే ఓ వీడియో చూసి నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు ఫంక్షన్ వెళ్లిన టైంలో బాగా రాత్రి అయిందని హడావుడిగా ఉన్నా. అంతలోనే నాకు దయా అన్న ఎదురయ్యాడు. రాన్న రాన్న ఫొటో తీసుకుందామని దయా అన్న అంటే నేను ఫొటో వద్దు ఏమీ వద్దని అక్కడి నుంచి వచ్చేశా. అయితే అది చాలా మంది మిత్రులు అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్గారితో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది.
నాకు మంచి మిత్రులు. మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఆయనతో ఉన్న చనువుతోనే అలా సరదాగా తోసేశాను. దాన్ని నేను కావాలనే చేసినట్టు కొంతమంది మీడియా మిత్రులు అపార్థం చేసుకున్నారు. ఈ వీడియో చూసిన ఆయన, నేను నవ్వుకున్నాం. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ఈ వీడియో చేస్తున్నానన్నాడు బ్రహ్మీ.
మాజీ మంత్రి ఎర్రబెల్లితో ఫోటో పంచాయితీ పై.. బ్రహ్మానందం క్లారిటీ!#Brahmanandam #Errabellidayakar #viralvideo pic.twitter.com/0R7jYRPj9G
— ramesh naini (@rameshnaini2) November 23, 2025
ఈవెంట్లో ఇలా..
ఫోటో కోసం అడిగిన ఎర్రబెల్లి దయాకర్.. నో చెప్పిన బ్రహ్మీ.. pic.twitter.com/oZbCrmemii
— JP_Journo (@jpjourno9) November 23, 2025
Meena | అందాల మీనా రెండో పెళ్లి ఎప్పుడు.. ఎట్టకేలకి క్లారిటీ వచ్చినట్టేనా?
Ajith Kumar | అరుదైన గౌరవం: అజిత్ కుమార్‌కు ‘జెంటిల్మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారం!