‘బ్రహ్మా ఆనందం’ సినిమా చూసిన వారంతా మా అబ్బాయి గురించే మాట్లాడుతున్నారు. మీకన్నా మీ అబ్బాయి బాగా చేశాడని మెచ్చుకుంటూ వుంటే తండ్రిగా చాలా సంతోషంగా ఉంది. చాలాకాలం తర్వాత ఓ మంచి పాత్ర చేశాననే సంతృప్తి కలిగింది. ఎప్పుడూ ఒకేరకం పాత్రలు కాకుండా ‘రంగమార్తాండ’ లాంటి పాత్రలు కూడా చేయాలనుంది. దర్శకులే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి.’ అని పద్మశ్రీ డా.బ్రహ్మానందం అన్నారు.
ఆయన, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్మీట్ని శనివారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడారు.
ఈ సినిమాకు వచ్చినన్ని అభినందనలు తన జీవితంలో ఏ సినిమాకూ రాలేదని, నాన్నగారి ప్రోత్సాహం వల్లే ఆ మాత్రం చేయగలిగానని రాజా గౌతమ్ అన్నారు. మౌత్ టాక్తో సినిమా దూసుకుపోతున్నదని నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా చెప్పారు. థియేటర్లలో ఆడియన్స్ ఎమోషనల్గా ఫీలవుతున్నారని దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ పేర్కొన్నారు.