Brahma Rakshasa | ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో నెక్స్ట్ మూవీ ఇదే.!
Prashanth Varma – Ranveer Singh | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘జై హనుమాన్’ (Jai Hanuman). గతేడాది ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం దీనికి సీక్వెల్ ‘జై హనుమాన్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.
Prashanth Varma – Ranveer Singh | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘జై హనుమాన్’ (Jai Hanuman). గతేడాది ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం దీనికి సీక్వెల్ ‘జై హనుమాన్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అయితే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, అన్ని భాషల్లో అదే టైటిల్ ఉంటుందని అంటున్నారు. ‘హనుమాన్’ సినిమా తరహాలోనే సూపర్‌హీరో కథాంశంతో ‘బ్రహ్మరాక్షస’ తెరకెక్కనుందని, భారీ సాంకేతిక హంగులతో ఈ సినిమాను తీయబోతున్నారని హనుమాన్ జయంతికి పూజా కార్యక్రమాలతో లాంఛ్ కూడా అయిందని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు సడెన్‌గా ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు రావడం మళ్లీ మొదలయ్యాయి. హీరో దర్శకుడు మధ్య క్రియేటివ్ డిఫెరెన్సెస్ వచ్చాయని, దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారని అంతా అన్నారు. కానీ ఈ వార్తలు ఫేక్ అని తాజాగా ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.
మరోవైపు ‘జై హనుమాన్’ కంటే ముందే ‘బ్రహ్మరాక్షస్’ సినిమా రానున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపాడు. ఇది కూడా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే వస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

