RAPO20 | బోయపాటి శ్రీను (Boyapati Srinu), ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ (Ram Pothineni) క్రేజీ కాంబోలో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. RAPO20గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన లుక్స్ ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు బోయపాటి శ్రీను. RAPO20 డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తెలియజేసింది బోయపాటి టీం.
మేకర్స్ బోయపాటి డబ్బింగ్ స్టూడియోలో ఉన్న స్టిల్‌ను ట్వీట్ చేస్తూ.. డబ్బింగ్ నేడు షురూ అయింది. ఊరమాస్ అవతార్‌లో ఉన్న ఉస్తాద్ రామ్‌ను కలిసేందుకు రెడీగా ఉండండి.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడీ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న రామ్ ఓ గుడి ముందు భారీ దున్నపోతు ముక్కుతాడు పట్టుకొని వస్తున్న స్టిల్‌ను విడుదల చేయగా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ది వారియర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. దీంతో ఈ సారి బోయపాటి శ్రీనుతో చేస్తున్న మూవీతో సూపర్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు రామ్.
డబ్బింగ్ స్టూడియోలో బోయపాటి..
#BoyapatiRAPO Dubbing Begins🎙️💥
Brace yourselves to meet
Ustaad @RamSayz in a MASSiest Avatar 🔥In Cinemas from 20th OCT 2023 ❤️🔥#BoyapatiRAPOonOct20#BoyapatiSreenu @sreeleela14 @MusicThaman @srinivasaaoffl @detakesantosh @SS_Screens pic.twitter.com/tSKh7Ep6vZ
— Srinivasaa Silver Screen (@SS_Screens) May 7, 2023
RAPO20 స్టన్నింగ్ పోస్టర్..
VASTUNAAM! See you this October!🔥#BoyapatiRAPO pic.twitter.com/MqXVHCnSiF
— RAm POthineni (@ramsayz) March 27, 2023
Read Also :
Sakshi Vaidya | గాండీవధారి అర్జున అప్డేట్.. సాక్షి వైద్య డబ్బింగ్ షురూ