Boyapati – Geetha Arts | కొన్ని కాంబినేషన్స్ గురించి వినగానే బ్లాక్‌బస్టర్ విజయం ఖాయం అనిపిస్తుంది. అచ్చంగా అలాంటి కాంబినేషనే.. కమర్షియల్ మాస్ బ్లాక్‌బస్టర్స్ దర్శకుడు బోయపాటి శ్రీను, అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌లది. అయితే వీరిద్దరు మళ్లీ చేతులు కలిపారు. బోయపాటి శ్రీనివాస్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను అల్లు అరవింద్ స్వంత నిర్మాణ సంస్థ GA బ్యానర్లో చేయబోతున్నట్లు గీతా ఆర్ట్స్ తాజాగా వెల్లడించింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు సరైనోడు సినిమా రాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుంగా అల్లు అర్జున్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇక 2016 తర్వాత అల్లు అరవింద్, బోయపాటి చేతులు కలుపుతుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బోయపాటి శ్రీనివాస్ గతేడాది స్కంద మూవీతో ప్రేక్షకుల ముందుకురాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా మిగిలింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించగా.. ప్రిన్స్, రాజా, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
MASSive forces to reckon with! ❤️🔥
A magical reunion of Mass Combo, Ace Producer #AlluAravind garu & Blockbuster Director #BoyapatiSreenu garu 💥
Electrifying Update Loading Soon! ⌛️#GAwithBS 🔥 pic.twitter.com/fk1DOB8VnN
— Geetha Arts (@GeethaArts) January 26, 2024