Border 2 | సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్-డ్రామా సినిమా ‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళు రాబడుతూ మినీ తుపాను సృష్టించింది. జనవరి 23న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే ప్రేక్షకులను థ్రిల్లర్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటూ, నార్త్ ఇండియాలోని థియేటర్లలో భీకరమైన వాతావరణాన్ని సృష్టించింది. మొదటి నాలుగు రోజుల్లో సినిమా నెట్ కలెక్షన్ 180 కోట్లను దాటింది. ‘బోర్డర్ 2’ తొలి రోజు 30 కోట్ల రూపాయలతో బాక్సాఫీస్‌ను ప్రారంభించింది. రెండవ రోజు 21.67 శాతం వృద్ధితో 36.5 కోట్లను కలెక్ట్ చేసింది. మూడవ రోజు 49.32 శాతం వృద్ధితో 54.5 కోట్లను రాబట్టింది. నాలుగవ రోజు 8.26 శాతం వృద్ధితో 59 కోట్ల రూపాయలు సాధించింది. ఐదో రోజు, అంటే మంగళవారం, సినిమా 19.50 కోట్లను కలెక్ట్ చేసి ఐదు రోజుల మొత్తం వసూళ్లను 196.50 కోట్ల రూపాయలకు పెంచుకుంది.
మంగళవారం వసూళ్లలో తగ్గుదల కనిపించడంతో, ధురంధర్ రీతిలో వసూలు చేయలేకపోయింది. ‘ధురంధర్’ ఐదో రోజు 27 కోట్లు సాధించగా, దాని కంటే తక్కువగా వసూలు చేసింది బోర్డర్ 2. హిందీ మార్కెట్ వరకూ చూస్తే, ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం, కల్కి 2898 ఏడీ సినిమాల కలెక్షన్ విడుదలైన ఐదో రోజు 19 కోట్ల కంటే తక్కువ అని ట్రేడ్ వర్గాల టాక్. అయితే ఐదో రోజు వసూలు పరంగా ‘బోర్డర్ 2’ అనేక పాపులర్ చిత్రాలను కూడా పక్కన పెట్టింది. ఇందులో ధూమ్ 3 (19.49 కోట్లు), పీకే (19.36 కోట్లు), ది కాశ్మీర్ ఫైల్స్ (18 కోట్లు), టైగర్ 3 (18 కోట్లు), ఓంజీ 2 (17.1 కోట్లు), తూ జూతీ మైన్ మక్కర్ (17.08 కోట్లు), కబీర్ సింగ్ (16.53 కోట్లు), గుడ్ న్యూస్ (16.2 కోట్లు) ఉన్నాయి.
ట్రేడ్ వర్గాల ప్రకారం, ‘బోర్డర్ 2’ ఐదో రోజు సాధించిన 19.50 కోట్ల వసూలు గత కొన్ని పెద్ద యాక్షన్, హిందీ బ్లాక్‌బస్టర్స్ కంటే అధికంగా ఉంది. ప్రేక్షకుల నుండి వచ్చిన పాజిటివ్ రివ్యూలు, యాక్షన్ సన్నివేశాల పాపులారిటీ, ‘బోర్డర్ 2’ ఐదు రోజులలోనే మంచి వసూళ్లతో హిందీ యాక్షన్-డ్రామా జానర్లో స్ట్రాంగ్ గా ఉన్నట్టు తెలుస్తోంది.