అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘బూమరాంగ్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. లండన్ గణేష్, డా.ప్రవీణ్‌రెడ్డి పూట్ల నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ జరిగింది. అతిథులుగా విచ్చేసిన కేఎల్ దామోదర్‌ప్రసాద్, డైరెక్టర్ విజయ్‌కుమార్ కొండా గ్లింప్స్‌ని లాంచ్ చేసి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
దర్శకుడు ఆండ్రూ బాబు మాట్లాడుతూ ‘ఇదో సందేశాత్మక సైకలాజికల్ థ్రిల్లర్. డీవోపీ కాకముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశా. ఆ ఇంట్రస్ట్‌తోనే కథలు రాసుకున్నా. వాటిలో తొలి కథ ‘బూమరాంగ్’. ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఈ కథ నిర్మాతలకు బాగా నచ్చింది. సినిమా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పారు.
ఈ సినిమాలో అంతర్లీనంగా ఉండే ఎమోషన్ చాలా బలంగా ఉంటుందని, కచ్ఛితంగా ఇది డిఫరెంట్ మూవీ అవుతుందని హీరో శివ కందుకూరి అన్నారు. ఇంకా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నిర్మాత డా.ప్రవీణ్ రెడ్డి పూట్ల కూడా మాట్లాడారు.