అజయ్ దిషన్, ధనుష జంటగా రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ ‘బూకీ’. గణేశ్‌చంద్ర దర్శకుడు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ పతాకాలపై రామాంజనేయులు జవ్వాజీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సత్యదేవ్ క్లాప్ ఇవ్వగా, నిర్మాత సి.కల్యాణ్ కెమెరా స్విచాన్ చేశారు.
‘బూకీ’ మంచి కమర్షియల్ సక్సెస్ అవుతుందంటూ నిర్మాత, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని నమ్మకం వెలిబుచ్చారు. విజయ్ ఆంటోని ‘డాక్టర్ సలీం’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశానని, దర్శకునిగా ‘బూకీ’ తన తొలి సినిమా అని, తనకీ అవకాశాన్నిచ్చిన నిర్మాతలు విజయ్ ఆంటోనీ, రామాంజనేయులుగార్లకు కృతజ్ఞతలని దర్శకుడు గణేశ్‌చంద్ర అన్నారు.
ఇంకా హీరోహీరోయిన్లు, నిర్మాత రామాంజనేయులు కూడా మాట్లాడారు. పాండియరాజన్, సునీల్, లక్ష్మి మంచు, ఇందుమతి మణిగండన్, వివేక్ ప్రసన్న తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: విఏఎఫ్సీ.