ముంబై: అభ్యంతరక సన్నివేశాలను తొలగించేందుకు హమారా బారాహ్(Hamare Baarah) చిత్ర నిర్మాతలు అంగీకరించారు. దీంతో ఆ ఫిల్మ్ రిలీజ్కు బాంబే హైకోర్టు ఓకే చెప్పేసింది. ఈ సినిమాను జూన్ 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇస్లామ్తో పాటు ముస్లింలపై నెగటివ్ ప్రచారం చేశారని, ఖురాన్ గురించి ఆ చిత్రంలో తప్పుగా చిత్రీకరించినట్లు కోర్టులో పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. జస్టిస్ బీపీ కొలాబావాలా, ఫిర్దోష్ పూనియావాలాతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది.
కొన్ని డైలాగ్లతో పాటు ఖురాన్ వచనాలను తొలగించేందుకు చిత్ర నిర్మాతలు అంగీకరించారు. సన్నివేశాలను తొలగించిన చిత్రానికి సీబీఎఫ్సీ మళ్లీ సర్టిఫికేట్ ఇవ్వనున్నది. పిటీషనర్ కోరుకున్నట్లు చిత్ర నిర్మాతలు ఏదైనా ఓ ఛారిటీ సంస్థకు 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అన్నూ కపూర్ ఈ సినిమాను నిర్మించారు.