మనదేశంలో ఫస్ట్ టీవీ టాక్ షో హోస్ట్‌గా పాపులర్ అయిన ఒకప్పటి బాలీవుడ్ నటి తబస్సుమ్ శుక్రవారం గుండెపోటుతో చనిపోయారు.ఈ విషయాన్ని ఆమె కుమారుడు హొషాంగ్ గొవిల్ వెల్లడించారు. 78 ఏళ్ల వయసున్న తబస్సుమ్‌కు శుక్రవారం రాత్రి రెండు నిమిషాల (8ః40, 8ః42 గంటలకు) వ్యవధిలోనే రెండుసార్లు గుండెపోటు వచ్చింది. దాంతో ఆమె చనిపోయారు. ’10 రోజుల క్రితం షూటింగ్ చేశాం. వచ్చే వారం కూడా షూటింగ్ వెళ్లాల్సి ఉంది. కానీ, ఇంతలోనే ఇలా జరిగింది’ అంటూ ఆమె కుమారుడు కంటతడి పెట్టుకున్నాడు. తబస్సుమ్ మృతిపట్ల బాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.
దూరదర్శన్‌లో వచ్చిన ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్ సెలబ్రిటీ టాక్ షోకు 1993 వరకు హోస్ట్‌గా చేశారు. మనదేశంలో మొదటి టీవీ టాక్ షో ఇది. 1947లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టారు. మెరా షహగ్, మంఝుదార్, బరి బెహన్, లేటర్ ఇన్ దీదర్ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించారు. 1990లో వచ్చిన స్వర్గ్ తబస్సుమ్ చివరి సినిమా.