ఆ శ్రమంతా పెట్టుబడే
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దాదాపు పదేండ్ల తర్వాత అసలైన స్టార్‌డమ్‌ను అస్వాదిస్తున్నది బాలీవుడ్ తార మృణాల్ ఠాకూర్. ఇన్నేండ్ల శ్రమంతా పెట్టుబడి అన్నట్లు ఆమెకు తీరిక లేనన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రేజ్ అంతా ‘సీతారామం’ ఘన విజయం ప్రభావమే అనుకోవచ్చు.
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దాదాపు పదేండ్ల తర్వాత అసలైన స్టార్‌డమ్‌ను అస్వాదిస్తున్నది బాలీవుడ్ తార మృణాల్ ఠాకూర్. ఇన్నేండ్ల శ్రమంతా పెట్టుబడి అన్నట్లు ఆమెకు తీరిక లేనన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రేజ్ అంతా ‘సీతారామం’ ఘన విజయం ప్రభావమే అనుకోవచ్చు. హిందీలో ఐదు చిత్రాల్లో నటిస్తున్న మృణాల్.. నాని హీరోగా నటిస్తున్న 30వ చిత్రంలోనూ కనిపించనుంది. తాజాగా ఈ భామ కోలీవుడ్‌లో అరంగేట్రానికి సిద్ధమవుతున్నది. సూర్య హీరోగా నటిస్తున్న 42వ చిత్రంలో నాయికగా మృణాల్ ఎంపికైంది. యుద్ధం నేపథ్యంగా సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శివ. ఈ చిత్రంలో ఒక నాయికగా దిశా పటానీ నటిస్తుండగా…మరో హీరోయిన్గా మృణాల్‌ను ఎంచుకున్నారు. ఈ చిత్రంలో ప్లాష్ బ్యాక్‌లో వచ్చే పీరియాడిక్ ఎపిసోడ్స్‌లో మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తున్నది. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వీర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పది భారతీయ భాషల్లో త్రీడీ ఫార్మేట్లో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో సూర్య ఐదు విభిన్న క్యారెక్టర్స్‌లో కనిపిస్తారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

