Singer Arijith Singh | బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ గాయపడ్డాడు. అర్జిత్ సింగ్ తాజాగా ఔరంగాబాద్‌లోని రిద్ధి సిద్ధి ల్యాండ్ మార్క్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించాడు. ఈ కాన్సర్ట్‌లో అర్జిత్ పలు పాటలు పాడుతూ స్టేజీ దగ్గరున్న అభిమానులకు షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ అర్జిత్‌ను గట్టిగా లాగింది. దాంతో ఒక్కసారిగా అర్జిత్ కిందపడిపోబోయాడు. ఈ క్రమంలో ఆయన చేతికి చిన్న గాయమైంది. కాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అర్జిత్ చేతికి గాయమైన వెంటనే ప్రదర్శనను ఆపి ‘మీరు ఇలా చేయడం వల్ల నా చేతికి గాయమైంది. నా హ్యాండ్ షేక్ అవుతుంది. నేను చేయిని కదపలేకపోతున్నానుఅని అన్నాడు’. దాంతో ఆ మహిళా అభిమాని క్షమాపణ కోరింది. తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అర్జిత్‌కు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీనిపై పలువురు ‘అభిమానం హద్దులు దాటింది’. ‘గెట్వెల్ సూన్ సర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అర్జిత్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు.