ముంబై: లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ గాయకుడు, మ్యూజిక్ కంపోజర్ సచిన్ సంఘ్వీ(Sachin Sanghvi)ని అరెస్టు చేశారు. మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం కల్పిస్తానని చెప్పి ఓ మహిళను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా అతను ప్రామిస్ చేశాడు. స్త్రీ 2, బేడియా లాంటి చిత్రాల్లో సంఘ్వీ పాటాలు పాడారు. భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద అతన్ని గురువారం అదుపులోకి తీసుకున్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలో సచిన్ తనకు పరిచయం అయినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సచిన్ మెసేజ్ చేసినట్లు ఆమె చెప్పింది. మ్యూజిక్ ఆల్బమ్‌లో చోటు కల్పిస్తానని సచిన్ తనకు ప్రామిస్ చేసినట్లు ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారని పోలీసులు చెప్పారు. ఆ పరిచయంతో మ్యూజిక్ స్టూడియోకు రావాలని ఆమెను సచిన్ ఆహ్వానించాడు. అక్కడ ఆమెకు మ్యారేజ్ ప్రపోజ్ చేసినట్లు కూడా తెలిసింది.
మ్యూజిక్ డైరెక్టర్ పలుమార్లు లైంగికంగా దాడి చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో చెప్పింది. అయితే ఆ ఆరోపణలను సచిన్ తరపున లాయర్ ఖండించారు. ఎఫ్ఐఆర్లో ఉన్న ఫిర్యాదులు నిరాధారమైనవని, ఈ కేసులో మెరిట్ లేదన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ఘటనపై సచిన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా జిగర్, థమ్మా చిత్రాలకు సచిన్ మ్యూజిక్ అందించారు. గత ఏడాది రిలీజైన స్త్రీ 2 చిత్రంలోని ఆజ్ కీ రాత్ పాట సూపర్ హిట్టైంది.