SSMB28 Movie | మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB28. ‘అలవైకుంఠపురం’లో తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసికల్ హిట్ల తర్వాత వీళ్ళ కాంబోలో మూడో సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
మాములుగా త్రివిక్రమ్ సినిమాలలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాల్లో పాత్రకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే ఎంపికచేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం బాలీవుడ్ నటి రేఖను సంప్రదించినట్లు తెలుస్తుంది. పాత్ర నచ్చడంతో ఆమే కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినికిడి. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఒకవేళ రేఖ నటిస్తే మాత్రం దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తెలుగులో సినిమా చేస్తుంది. చివరగా రేఖ అమ్మ కోసం అనే సినిమాలో నటించింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ హీరో సాయి రోనాంక్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. థమన్ స్వరాలందిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.