సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ను నిందించాల్సిన అవసరం లేదని, ఎక్కువ మంది ప్రజలు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. ‘సాధారణంగా దక్షిణాది వారికి సినీ తారల పట్ల అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. రజనీకాంత్, చిరంజీవి, మహేష్‌బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానుల సందడి ఎక్కువగానే ఉంటుంది.
ఓసారి చెన్నైలో అజిత్ నటించిన సినిమా సెకండ్‌షోకు వెళ్లాను. అప్పటికే అక్కడ 20వేల మందికిపైగా అభిమానులు ఉన్నారు. సినిమా థియేటర్ వద్ద అంత పెద్ద జనసందోహాన్ని చూడటం అదే తొలిసారి. సినిమా పూర్తయ్యాక అర్థరాత్రి సమయంలో కూడా ఎంతో మంది ప్రేక్షకులు బయట నిరీక్షిస్తూ కనిపించారు. ఆ రోజు సంధ్య థియేటర్‌కు ఎక్కువ మంది జనాలు వచ్చిన కారణంగానే దురదృష్టకరమైన ఘటన జరిగింది. అది నిజంగా బాధాకరం’ అని బోనీకపూర్ పేర్కొన్నారు.