తెలుగులో ఇప్పటివరకూ మూడు సినిమాల్లో నటించింది మృణాళ్ ఠాకూర్. వాటిలో సీతారామం, హాయ్ నాన్న బాగా ఆడాయి. ‘ఫ్యామిలీ స్టార్’ మాత్రం కాస్త చేదు అనుభవాన్నే ఇచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో అడివి శేష్‌తో ‘డెకాయిట్’లో నటిస్తున్నది. ఓ వైపు తెలుగులో సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ, మరోవైపు బాలీవుడ్‌లోనూ తన గుర్తింపును కాపాడుకుంటున్నది ఈ మరాఠీ సుందరి. ప్రస్తుతం బాలీవుడ్లో ఆమె నటించిన ‘సన్నాఫ్ సర్దార్ 2’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్న మృణాళ్ పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లాడాలని, అమ్మని కావాలని నాకూ ఉంది. కాబోయే భర్త, పిల్లల విషయంలో ఇప్పటికీ కలలు కంటూనే ఉన్నా. ఆ విషయంలో నాకంటూ కొన్ని ఆశలున్నాయి. అయితే.. దేనికైనా రైట్ టైమ్ రావాలి. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్ పైనే. నటిగా ఇంకా చాలా సాధించాలి. కెరీర్ పరంగా సంతృప్తి చెందాకే.. పెళ్లి’ అని అందంగా నవ్వేశారు మృణాళ్ ఠాకూర్.