Bollywood | ఇటీవలి కాలంలో బాలీవుడ్ చిత్రాలు పెద్దగా సక్సెస్ సాధించింది లేదు. ఖాన్ హీరోల సినిమాలకి కూడా ఆదరణ దక్కడం లేదు. దాంతో బాలీవుడ్ పని ఖతమైనట్టే అని అందరు అనుకుంటున్నారు. కాని ఇప్పుడు సీనియర్ హీరో అజయ్ దేవగణ్.. బాలీవుడ్‌కి ఊపిరి పోసాడు. ఆయన నటించిన రైడ్ 2 చిత్రం మంచి హిట్ టాక్ దక్కించుకోగా, తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లే రాబట్టింది. అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన `రైడ్ 2` చిత్రం మొదటి రోజు 18.25 కోట్ల వసూళ్లు సాధించింది. `రైడ్ 2` మూవీ 2018లో వచ్చిన `రైడ్` కి సీక్వెల్ గా రూపొందింది.
రైడ్ 2 చిత్రం ఐటీ రైడ్స్ ప్రధానంగా తెరకెక్కగా, ఇందులో సౌరభ్ శుక్లా విలన్ పాత్ర పోషించారు. అదే సమయంలో, `రైడ్ 2`లో రితేష్ దేశ్‌ముఖ్ విలన్ పాత్రలో నటించారు. దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా `రైడ్ 2 ` చిత్రాన్ని 48 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, ఈ చిత్రానికి భూషణ్ కుమార్, అభిషేక్ పాఠక్, కృష్ణ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. వాణీ కపూర్, రజత్ కపూర్, సౌరభ్ శుక్లా, సుప్రియా పాఠక్, అమిత్ సైల్, యశ్పాల్ శర్మ, గోవింద్ నామ్‌దేవ్, బ్రిజేంద్ర కాలా ప్రధాన పాత్రల్లో నటించారు. తొలి రోజు ఈ చిత్రం మంచి వసూళ్లే రాబట్టగా, వారాంతంలో మరిన్ని వసూళ్లు రాబడుతుందని అంటున్నారు.
రైడ్ 2 జోరు చూస్తుంటే మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అవుతుందనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలీవుడ్ సినిమా ఇటీవల బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్ అవుతున్న నేపథ్యంలో రైడ్ 2 చిత్రం ఊపు తెచ్చేలా కనిపిస్తుంది. రైడ్ 2 సినిమాకు ఏకపక్షంగా హిట్ టాక్ రావడంతో నార్త్ ఇండియాలో ప్రేక్షకుల సానుకూలంగా స్పందించారు. ఓవర్సీస్లో ఈ సినిమా 5 కోట్ల మేర వసూళ్లు సాధించవచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు 20 నుంచి 22 కోట్ల మధ్య కలెక్షన్లు రాబట్టినట్టు అర్ధమవుతుంది.