శారీరకంగా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా అనుకున్న సమయానికి షూటింగులకు హాజరు కావాల్సిన పరిస్థితి సినిమా వాళ్లది. ముఖ్యంగా ఈ విషయంలో కథానాయికలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా ఓ బిడ్డకు జన్మినిచ్చిన బాలీవుడ్ భామ కియారా ఆద్వానీ ఈ విషయంపై ఆసక్తికరంగా మాట్లాడారు. ‘నాకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఖరారైంది? షూటింగులను ఎలా మేనేజ్ చేశాను? అనే విషయాలపై చాలామందికి పలు అనుమానాలున్నాయి. వారందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. గర్భం దాల్చిన ఏడో నెల వరకూ నేను నటిస్తూనే ఉన్నా. ఈ విషయం నా దర్శక, నిర్మాతలకు మాత్రమే తెలుసు. షాట్ ముగియగానే కారవాన్‌లోకి వెళ్లి, కడుపులో ఉన్న నా బిడ్డతో మాట్లాడేదాన్ని .
‘కేవలం నటిస్తున్నానంతే.. భయపడకు’ అంటూ నా బిడ్డకు భరోసా ఇచ్చేదాన్ని. ‘వార్2’లో బికినీ సీన్‌పై కూడా చాలా వార్తలొచ్చాయి. ఆ టైమ్‌లో నేను ప్రెగ్నెంట్ కాబట్టి, ఏఐ ద్వారా ఆ సీన్స్ మేనేజ్ చేశారని చాలా మంది రాశారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఆ ఫిజిక్ నాదే. బికినీ ఫిజిక్ కోసం కఠోరమైన క్రమశిక్షణ పాటిస్తే ఆ రూపం వచ్చింది. అయితే.. ఆ సీన్స్ తీసేటప్పుడు నేను రెండో నెల గర్భిణిని. కాబట్టే తేడా కనిపించలేదు.’ అంటూ చెప్పుకొచ్చింది కియారా అద్వానీ. ప్రస్తుతం ‘కేజీఎఫ్’ఫేం యష్ ‘టాక్సిక్’ సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.