బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్.. కృతి సనన్, ప్రభాస్ స్నేహాన్ని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. వరుణ్, కృతి కలిసి నటించిన ‘భేడియా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. ఆ కార్యక్రమ హోస్ట్ కరణ్ జోహార్ ప్రశ్నకు సమాధానంగా వరుణ్ మాట్లాడుతూ…‘కృతి మనసు అతని దగ్గరుంది. ఆ హీరో ప్రస్తుతం ముంబైలో లేడు. మరో ప్రాంతంలో దీపికాతో కలిసి సినిమాలో నటిస్తున్నాడు’ అని అన్నాడు.
ఆ హీరో ప్రభాస్ అనీ, అతను దీపికాతో కలిసి ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నటించడాన్నే వరుణ్ ధావన్ పేర్కొన్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ప్రభాస్, కృతిసనన్ కలిసి ‘ఆది పురుష్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల వీరిద్దరి స్నేహం గురించి పలు వార్తలు వస్తున్నాయి. కుదిరితే ప్రభాస్‌ను పెండ్లి చేసుకుంటానని ఈ మధ్య కృతి సనన్ చెప్పింది. ఇప్పుడు వరుణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఆన్‌స్క్రీన్ జంట గురించి మరింత మాట్లాడుకునేలా చేస్తున్నాయి. మరోవైపు తన సినిమా ప్రచారం కోసమే వరుణ్ ధావన్ ఇలా ప్రభాస్, కృతి స్నేహంపై వ్యాఖ్యలు చేస్తున్నాడనే విమర్శలూ వస్తున్నాయి.