బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్టు టైగర్ 3. ఈ మూవీ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు సల్లూభాయ్. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న దృశ్యాలు అద్దంలో కనిపిస్తుండటం వీడియోలో చూడొచ్చు. సల్మాన్ కండలు తిరిగిన దేహంతో వర్కవుట్ చేస్తుండగా..బ్యాక్ గ్రౌండ్ లో టైగర్ థీమ్ సాంగ్ ట్యూన్ ప్లే అవుతోంది.
ఇతడు టైగర్ 3 కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడనుకుంటా..బీయింగ్ స్ట్రాంగ్ గ్లోబల్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సల్మాన్. టైగర్ ప్రాంఛైజీలో వస్తున్న మూడో చిత్రం టైగర్ 3. మూడోసారి కత్రినాకైఫ్ సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేయబోతుంది. మరోవైపు సాజిద్ నదియావాలాతో కలిసి కిక్ 2 సినిమా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో అంతిమ్..ది ఫైనల్ ట్రుత్ లో కూడా నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?