ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సభ్యులు ఇంటి సంబంధిత అవసరాల కోసం తమ ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదును ఉపసంహరించుకోవచ్చు. ఇటీవలి ఈపీఎఫ్‌వో మార్గదర్శకాల ప్రకారం.. సభ్యత్వం పొంది ఏడాది దాటితే అందుబాటులో ఉన్న మొత్తం నిధిలో నిబంధనలకు లోబడి 75 శాతం వరకు వెనుకకు తీసుకోవచ్చు. ఈ సొమ్మును ఇంటి కొనుగోలు, నిర్మాణం, మరమ్మతులు, నవీకరణ, ఇప్పటికే ఉన్న గృహ రుణాన్ని తీర్చేందుకు వాడుకోవచ్చు. అలాగే ఈపీఎఫ్‌వో సంస్కరణల్లో భాగంగా మారిన నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ సభ్యులు తమ ఉద్యోగ జీవితకాలంలో గరిష్ఠంగా ఐదుసార్లు ఇంటి కోసం నగదు ఉపసంహరణలు చేసుకోవచ్చు.
సరళతర విధానం
గతంలో ఉన్న 13 రకాల పాక్షిక ఉపసంహరణ నిబంధనలను ఇప్పుడు ఒకే సమగ్రమైన, సరళీకృత విధానంలోకి విలీనం చేశారు. మునుపు సభ్యుడు నగదు ఉపసంహరించుకుంటే ఉద్యోగి చందా, వడ్డీ ఆదాయంలో నుంచి మాత్రమే వచ్చేది. ఇప్పుడు సంస్థ చెల్లించే చందాలో నుంచి కూడా నగదును ఇస్తుండటం గమనార్హం. దీంతో మరింత నగదు చేతికి అందుతున్నది. అలాగే అనారోగ్యంబారినపడ్డ సభ్యులు వైద్య ఖర్చుల నిమిత్తం ఉపసంహరణలకు దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి పరిమితులూ లేవు. మిగతా అవసరాలకు మాత్రం పరిమితులున్నాయి.
మిగతా అవసరాల్లో..
వైద్య ఖర్చులు: వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం ఈపీఎఫ్ సభ్యులు ఖాతా నుంచి నగదును ఎన్నిసాైర్లెనా తీసుకోవచ్చు. అయితే ఈ మేరకు వర్తించే ఈపీఎఫ్ నిబంధనలకు లోబడి క్లెయిమ్‌ల పరిష్కారం ఉంటుంది.
చదువుల ఫీజులు: తమ లేదా పిల్లల చదువు ఖర్చుల కోసం కూడా ఈపీఎఫ్ నగదును వెనుకకు తీసుకోవచ్చు. సభ్యత్వం కాలవ్యవధిలో 10సార్లు ఈ అవకాశం ఉంటుంది.
పెండ్లి కోసం: తమ లేదా అర్హులైన కుటుంబ సభ్యుల వివాహ ఖర్చుల నిమిత్తం సభ్యులు ఈపీఎఫ్ సొమ్మును తీసుకోవచ్చు. అయితే సభ్యత్వకాలంలో ఇందుకు ఐదుసార్లు మాత్రమే వీలున్నది.
ఇతరాలు: కేంద్ర ట్రస్టీల బోర్డు ప్రకటించిన ప్రత్యేక పరిస్థితుల్లోనూ ఈపీఎఫ్ అడ్వాన్స్‌ల కోసం సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే ఇందుకు అవకాశం ఉంటుంది.
హౌసింగ్ కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ ఎంత?
ప్రస్తుత ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం సభ్యులు తమ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు తీసుకోవచ్చు
అవసరాలు
ఇల్లు, ఫ్లాట్ లేదా స్థలం కొనుగోలుకు ఇంటి నిర్మాణానికిగృహ రుణం తీర్చడానికిమరమ్మతులు, ఇల్లు నవీకరణకు
అర్హత
ఈపీఎఫ్ సభ్యత్వం వచ్చిన 12 నెలల తర్వాత అర్హులు
ఎన్నిసార్లు?
సభ్యత్వ కాలంలో గరిష్ఠంగా ఐదుసార్లు
ఈపీఎఫ్‌వో మెంబర్ పోర్టల్ ద్వారా ఫామ్ 31 సమర్పించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు