ఇక తాను రొమాంటిక్ కామెడీ మూవీస్ చేయనని ప్రకటించారు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. ఈ తరహా చిత్రాలతో విసుగు చెందానని, ఇప్పుడు మారిన ట్రెండ్‌కు, తనకున్న ఇమేజ్‌కు లవ్‌స్టోరీస్ సెట్ కావని ఆయన అన్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణ్‌బీర్ పాల్గొన్నారు. ఇక్కడి వేదిక మీద ఆయన మాట్లాడుతూ..‘లవ్ రంజన్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్నాను.
ఇదే నా చివరి రోమ్ కామ్ అని చెప్పుకోవచ్చు. ఇకపై ఈ తరహా చిత్రాల్లో నటించను. నా వయసు, ఇమేజ్ చూస్తే ఇక లవ్‌స్టోరీస్ వద్దనిపిస్తున్నది. ఇప్పటికే ఆలస్యంగా తండ్రినయ్యాను. నా పిల్లలకు ఇరవై ఏండ్లు వచ్చేప్పటికి నేను అరవైలో పడతాను. అప్పుడు నా పిల్లలతో కలిసి ఆటలాడలేను, పరుగులుపెట్టలేనేమో అనిపిస్తున్నది’ అని చెప్పారు.
ప్రస్తుతం రణ్‌బీర్.. శ్రద్ధా కపూర్‌తో కలిసి లవ్ రంజన్ దర్శకత్వంలో ఓ చిత్రం, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రష్మిక నాయికగా నటిస్తున్నది. గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘యానిమల్’ సినిమాలో రణ్‌బీర్ గ్రే షేడ్ పాత్రలో కనిపించనున్నారు.