బాలీవుడ్ హీరో అర్భాజ్‌ఖాన్ తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. హిందీ చిత్రసీమలో తనదైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన ‘జై చిరంజీవ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన తెలుగులో పునరాగమనం చేస్తున్నారు.
అశ్విన్‌బాబు కథానాయకుడిగా గంగా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. అప్సర్ దర్శకుడు. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాత. ఈ సినిమాలో అర్భాజ్‌ఖాన్ కీలక పాత్రలో నటించబోతున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఆర్భాజ్‌ఖాన్ పాత్ర కథా గమనంలో కీలకంగా ఉంటుంది. మంగళవారం మొదలుపెట్టిన కొత్త షెడ్యూల్లో ఆయన జాయిన్ అయ్యారు’ అని అన్నారు.