‘నేను నటిని మాత్రమే కాదు. ప్రస్తుతం తల్లిని కూడా. ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే ఈ రెండు బాధ్యతల్నీ విజయవంతంగా నిర్వర్తించొచ్చని కొందరు అంటున్నారు. కానీ వాస్తవానికి అది చాలా కష్టం. కొత్తగా తల్లి అయిన స్త్రీలను పని ఒత్తిడికి లోను చేయడం సమంజసం కాదు. ఈ విషయంలో అంతా సదరు స్త్రీలకు మద్ధతుగా నిలవాలి.’ అని నటి దీపిక పదుకోణ్ అన్నారు. ‘8గంటల వర్కింగ్ అవర్స్’ డిమాండ్‌తో కొన్ని నెలలుగా చర్చనీయాంశమయ్యారామె.
ఈ కారణంగా కొన్ని సినిమాలను కూడా ఆమె వదులుకున్నారు. రీసెంట్గా తన అభిప్రాయాన్ని సమర్ధించుకుంటూ మళ్లీ మాట్లాడారు దీపిక. ‘ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అత్యుత్తమంగా పనిచేయగలం. ఒత్తిడికి లోనైతే అవుట్‌పుట్ కూడా సరిగ్గా రాదు. అందుకే.. నా సొంత ఆఫీస్‌లో కూడా నా ఉద్యోగులందరికీ సోమవారం నుంచి శుక్రవారం వరకూ రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయిస్తాను. ఎవరికైనా సరే ఆరోగ్యమే ప్రధానం. దాన్ని కాపాడుకోవడమే అన్నింటికన్నా ముఖ్యం.’ అని చెప్పుకొచ్చారు దీపిక పదుకోణ్.