బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Aug 22, 2020 , 12:47:21

గ‌ణేష్ పూజ‌లో టాలీవుడ్, బాలీవుడ్ తార‌లు

గ‌ణేష్ పూజ‌లో టాలీవుడ్, బాలీవుడ్ తార‌లు

దేశ వ్యాప్తంగా వినాయ‌క చవితి ఉత్స‌వాలు అంబ‌రాన్నంటుతున్నాయి. సామాన్యులు, సెల‌బ్రిటీలు ఇళ్ళ‌లో ప‌ర్యావ‌ర‌ణ హితంగా  వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ని ప్ర‌తిష్టించి పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. చిరంజీవి, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, నితిన్, శిల్పా శెట్టి, హేమ‌మాల‌ని ఇలా ఇండ‌స్ట్రీల‌కి సంబంధించి ప‌లువురు సెల‌బ్రిటీలు ఇంట్లోనే ఉంటూ వినాయ‌క చ‌వితి పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. 

భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితిని వినాయక చవితి జరుపుకుంటారు. గణపతి నవరాత్రులు, అందంగా అలంకరించిన మండపాలు ఈ పండగకు ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఇంటా వినాయక ప్రతిమలను ఉంచి పూజలు చేస్తారు. ఈ ఏడాది కరోనా.. వేడుకలపై ప్రభావం చూపినా.. ప్రజల్లో మాత్రం చవితి ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదనే చెప్పుకోవాలి. విఘ్నాలను ప్రారద్రోలే ఆ వినాయకుడు.. ఈ కరోనాను కూడా తరిమి కొడతారని భక్తులు విశ్వసిస్తున్నారు.