కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించే అందం ఎవరైనా ఉన్నారా..? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బాలీవుడ్ (Bollywood) నటి సన్నీలియోన్ (Sunny Leone). నాలుగు పదుల వయస్సులో కూడా నా అందంతో మీరు పోటీ పడగలరా..? అన్నట్టుగా యువ హీరోయిన్లకు గట్టి సవాలు విసురుతోంది ఈ కెనడియన్ సుందరి. గ్లామర్ ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ అందాలు ఆరబోస్తుంది. ప్రతీ రోజూ ఏదో ఒక హాట్ స్టిల్ తో నెటిజన్ల ముందుకొచ్చి అందరినీ కలవరపెడుతోంది సన్నీలియోన్.
ఈ బ్యూటీ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం మాల్దీవుల్లో (Maldives) విహరించిన విషయం తెలిసిందే. బికినీ వేర్ లో సాగర తీరంలో జలకాలాడుతూ..ఇసుక తిన్నెల్లో విహరిస్తూ దిగిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ భామ సాగర తీరంలో నీలి రంగు బికినీ (Blue bikini) దర్శనమిచ్చిన ఓ స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్యారడైజ్ లో మరొక రోజూ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.
నీలాకాశం, అందమైన సముద్ర తీరం..ఆ రెండింటి మధ్యలో బ్లూ బికినీ లో సన్నీలియోన్..చూసేందుకు రెండు కళ్లు చాలవా అన్నట్టుగా ఉన్న ఈ స్టిల్ అందరి మతులు పోగొడుతోంది. మరోవైపు ముదురు ఎరుపు రంగులో బికినీలో సముద్రంలో నుంచి హొయలు నడుచుకుంటూ వస్తున్న వీడియోను కూడా పంచుకుంది. సన్నీలియోన్ స్టిల్, వీడియో ఇపుడు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి.
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Sanjay Dutt: సౌత్లోను బిజీ అవుతున్న సంజయ్ దత్