చిరంజీవి సినిమాలో నటించడానికి ఏ హీరోయిన్ మాత్రం ఒప్పుకోదు..? మెగాస్టార్‌తో నటించడానికి చాలా మంది హీరోయిన్లు కాచుకుని కూర్చుంటారు. ఎప్పుడెప్పుడు తమకు అవకాశం వస్తుందని కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ వేచి చూసే హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ తాజాగా మెగాస్టార్ సినిమాలో అవకాశం వచ్చినా కూడా ఒక హీరోయిన్ బెట్టు చేస్తుంది. అడిగినంత ఇస్తే తప్ప చిరుతో నటించే సమస్యే లేదంటూ భీష్మించుకు కూర్చుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన సినిమాలకు కథలు సిద్ధం చేయడం పెద్దగా సమస్య లేదు.. కానీ హీరోయిన్లను జత చేయడం మాత్రం ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. మరీ ముఖ్యంగా 60 ప్లస్ మెగాస్టార్‌కు సరిపోయే హీరోయిన్ను వెతికి తీసుకురావడానికి నిర్మాతలకు.. దర్శకులకు తలప్రాణం తోకలోకి వస్తుంది. తాజాగా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు. ఒక అభిమాని, స్టార్ హీరో మధ్యలో జరిగే ఎమోషనల్ జర్నీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బాబీ. ఇందులో చిరంజీవితో పాటు మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నాడు. ఈ అవకాశం సత్యదేవ్‌కు వస్తుందని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఎవర్నీ ఫైనల్ చేయలేదని చిత్ర యూనిట్ చెబుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
ఇందులో హీరోయిన్గా నటించడానికి బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా పేరు పరిశీలిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇందులో నటించడానికి సోనాక్షి సిన్హా ఏకంగా మూడున్నర కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తోంది. బాలీవుడ్లో అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సోనాక్షి.. సౌత్ సినిమాలో నటించడానికి మాత్రం ఏకంగా మూడు కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేయడం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో నటించడానికి ఇంకా బెట్టు చేయడం ఏంటో అంటూ అంతా షాక్ అవుతున్నారు. గతంలో ఈమె రజనీకాంత్ హీరోగా లింగా సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్లీ సౌత్ సినిమాల వైపు రాలేదు సోనాక్షి సిన్హా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సిన్మా చూస్తే పాగల్ అయిపోతారు.. పాగల్ మూవీ పబ్లిక్ టాక్
‘మా’లో హీట్ పెంచుతున్న ఎన్నికల లొల్లి
మా సభ్యులకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసిన నరేష్
కలలోనే నన్ను అరెస్ట్ చేయగలరు.. బిగ్ బాస్ భామ సంచలన కామెంట్స్