Sree Vishnu | శ్రీవిష్ణు నుంచి మరో కొత్త సినిమా.. కామెడీకి దూరంగా ఎమోషనల్ కథతో వస్తున్న యంగ్ హీరో!
Sree Vishnu | వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో కొత్త సినిమాను ప్రకటించారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు.. ఈసారి మాత్రం సరికొత్త ఎమోషనల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
Sree Vishnu | వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో కొత్త సినిమాను ప్రకటించారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు.. ఈసారి మాత్రం సరికొత్త ఎమోషనల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ సమర్పణలో హారికా సూర్యదేవర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు సన్నీ సంజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ అధినేత చినబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ గ్లింప్స్ విడుదల చేశారు.
తాజాగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కనే ఓ సాధారణ మధ్యతరగతి అబ్బాయి.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, బాధ్యతల కారణంగా తన ఆశలను పక్కన పెట్టి సాధారణ జీవితాన్ని కొనసాగించే పరిస్థితిని ఇందులో చూపించినట్లు తెలుస్తోంది. మంచి కాలేజీలో చదవాలనే కోరిక ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా సాధారణ కాలేజీలో చదవడం.. జీవితంలో ఎన్నో సాధించాలని ఆశించినా కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగం చేయడం.. ఇలా ఎంతోమంది మిడిల్ క్లాస్ యువకుల జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.
శ్రీవిష్ణు సినిమాలంటే సాధారణంగా కామెడీ, ఎంటర్టైన్మెంట్తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్‌లు గుర్తుకొస్తాయి. అయితే ఈసారి ఆయన అందుకు భిన్నంగా ఎమోషనల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తన కలలను, ఆశలను కుటుంబం కోసం త్యాగం చేసే మిడిల్ క్లాస్ యువకుడి పాత్రలో శ్రీవిష్ణు కనిపించనున్నారని సమాచారం. గ్లింప్స్‌లో చూపించిన సన్నివేశాలు కూడా పాత్రలోని ఎమోషన్‌ను హైలైట్ చేసేలా ఉన్నాయి. దీంతో ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్లో మరో డిఫరెంట్ మూవీగా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను మాత్రం ప్రకటించలేదు. కథ, పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ రాబోయే రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. శ్రీవిష్ణు, సితార ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్లో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

