బాలీవుడ్ నాయిక పరిణీతి చోప్రా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె నిశ్చితార్థం శనివారం ఢిల్లీలో జరిగింది. రాజీవ్ చౌక్‌లోని కపుర్తాల హౌస్‌లో పరిణీతి, రాఘవ్ నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, చిత్ర పరిశ్రమలోని సహచరులు హాజరయ్యారు. లండన్ నుంచి ప్రియాంక చోప్రా తన సోదరి పరిణీతి ఎంగేజ్మెంట్ కోసం విచ్చేసింది. త్వరలోనే వీరి వివాహ తేదీని నిర్ణయించనున్నారు.