ఇతరులతో ప్రేమగా ఉండటంతో పాటు మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యమని అంటున్నది బాలీవుడ్ నాయిక కృతిసనన్. గతంలో చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుంటూ మనసును బాధపెట్టుకోవడం ఏమాత్రం సరికాదన్నది ఆమె మాట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సుందరి తన వంతుగా మంచి మాటలు చెప్పింది.
కృతి మాట్లాడుతూ…‘ఎప్పుడూ మన లోపాలనే వెతుక్కోకూడదు. ఎప్పుడో చేసిన తప్పుల్ని గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతుంటాం. అలాంటివి మర్చిపోవాలి. మనకంటూ ఓ గొప్పదనం, ప్రత్యేకత ఉంటాయి. వాటికి సంతోషించాలి. సానుకూలంగా ఆలోచించాలి. మనకు మనం బాగా లేమని అనుకోవడం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇతరు ల పట్ల ప్రేమగా ఉండటం అవసరమే అయితే అంతకంటే మనపై మనం ప్రేమగా ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి’ అని చెప్పింది.