బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అజాగ్రత్త’ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. రాధిక కుమారస్వామి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.శశిధర్ దర్శకుడు. రవిరాజ్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఏ.ఎం.రత్నం క్లాప్‌నివ్వగా, నిర్మాత ఠాగూర్ మధు కెమెరా స్విఛాన్ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత వుంటుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే చిత్రమిది’ అన్నారు. రావు రమేష్, సునీల్, ఆదిత్యమీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీహరి