Pahalgam Terror Attack | జమ్ము కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ఈ దాడిని ఖండిస్తూ.. ఉగ్రవాదంపై బదులు తీసుకునే సమయం వచ్చిందని తెలిపాడు. ఉగ్రవాదానికి ఎటువంటి మతం లేదని తెలిపిన ఆయన ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, వారికి “తిరిగి చెల్లించాలి” (payback) అని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని మతం పేరుతో సమర్థించే వారికి ఖండించిన ఆయన.. టెర్రరిజంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, శాంతిని నెలకొల్పడానికి అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా ఇమ్రాన్ చేసిన ప్రస్తుతం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సినిమాల విషయానికి వస్తే.. ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం గ్రౌండ్ జీరో (Ground Zero). దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.