సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 00:32:19

జయంరవి, హన్సిక, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో ‘బోగన్‌'

 జయంరవి, హన్సిక, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో ‘బోగన్‌'

జయంరవి, హన్సిక, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘బోగన్‌'. ఈ సినిమాను అదే పేరుతో ఎస్‌.ఆర్‌.టి  ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి తెలుగులోకి అనువదిస్తున్నారు. లక్ష్మణ్‌ దర్శకుడు. ఈ చిత్రంలోని ‘సింధూర తనువై మెరిసే.. సింధూర విరిసే హృదయం’ అనే గీతాన్ని శుక్రవారం విడుదల        చేశారు. ఇమామ్‌ సంగీతాన్ని అందించిన ఈ గీతాన్ని సమీర భరద్వాజ్‌ ఆలపించారు. భువనచంద్రసాహిత్యాన్ని అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘బ్యాంకు దోపీడీకి పాల్పడిన నేరస్తుడి కోసం ఓ పోలీస్‌అధికారి సాగించే అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఆద్యంతం  ఊహకందని మలుపులతో ఉత్కంఠను పంచుతుంది. జయంరవి, అరవిందస్వామి పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. ఇటీవల విడుదలచేసిన ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. మంచి సినిమాగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది. త్వరలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. నాజర్‌, పొన్‌వణ్ణన్‌, అక్షరగౌడ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్‌. logo