Chiranjeevi | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తన మనవరాలి కోరిక మేరకు మెగాస్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ నయనతారను మర్యాదపూర్వకంగా కలిసారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఐరా ఆశీష్ ఇటీవల భారత్‌కు వచ్చారు. ఆమె చిరంజీవిని కలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయగా రామచందర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవిని షూటింగ్ స్పాట్లో కలిశారు. ఈ కలయికకి సంబంధించిన ఫొటోలని రామచందర్ రావు ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. సమావేశంలో సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు సమకాలీన రాజకీయాలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవి తమకు ఎంతో ఆప్యాయతతో సమయం కేటాయించారని రామచందర్ రావు తెలిపారు. ఈ కలయిక తమ కుటుంబానికి మరపురాని ఆనందాన్నిచ్చిందని స్పష్టం చేశారు. ఇక చిరు సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad garu) అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఈ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర షోషిస్తున్నాడు. సెట్స్‌లో అక్టోబర్ 21న ఆయన అడుగుపెట్టనున్నట్టు తెలుస్తుంది. సినిమా కథనంలో వెంకీ పాత్ర చాలా ఎమోషనల్‌గా, కీలకంగా ఉంటుందని.. వెంకీ రోల్ సినిమాలో హ్యూమర్ టచ్ ఇస్తుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే విడుదల చేసిన మీసాల పిల్ల సాంగ్ అభిమానుల్లో జోష్ నింపింది. ఈ మూవీలో మలయాళ స్టార్ యాక్టర్, దసరా ఫేం షైన్ టామ్ చాకో మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.