నీరజ్ చోప్రా.. ఇప్పుడు ఇతనిని ఇండియన్ సూపర్ స్టార్‌గా వర్ణిస్తున్నారు. 23 ఏళ్ల వయస్సులో పసిడితో భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరదీశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్ వందేళ్ల పతక నిరీక్షణకి తెరదించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో జావెలిన్‌ని 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన రెండో భారతీయుడిగా నిలిచాడు. ఇప్పటి వరకూ అభివన్ బింద్రా మాత్రమే (2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో) ఈ ఘనత సాధించాడు.
నీరజ్ చోప్రా పసిడి పతకం గెలిచి భారతీయులు అందరు గర్వపడేలా చేశారు. అతనికి కొన్ని కంపెనీలు భారీ గిఫ్ట్‌లు అందిస్తున్నాయి. ప్రభుత్వాలు నజరానాతో పాటు జాబ్స్ కూడా ఇస్తున్నాయి. అయితే ఆయనపై బయోపిక్ కూడా తీయాలనే చర్చ నడుస్తుంది. చరిత్ర పేజీల్లో తన పేరుని లిఖించుకున్న నీరజ్ చోప్రా తన బయోపిక్ లో ఏహీరో నటిస్తే బాగుంటుందో చెప్పుకొచ్చాడు.
జావెలిన్ త్రో లో స్వర్ణం గెలిచాక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బయోపిక్ ప్రస్తావనకు వచ్చింది. మరి తనపై కనుక బయోపిక్ ని ఎవరైనా తీస్తే బాగుంటుంది అని ప్రశ్నించాగా, దానికి రణదీప్ హూడా కానీ లేదా బాలీవుడ్ మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ అని చెప్పాడు. తాను అక్షయ్ కి పెద్ద అభిమానిని అని కూడా తెలియజేసాడు. సో తన బయోపిక్ కనుక తీస్తే అక్షయ్ కుమార్ ఫస్ట్ చాయిస్ అని నీరజ్ మాటల ద్వారా అర్ధం అవుతుంది.