Bindu Madhavi | సినీ ఇండస్ట్రీలో డేటింగ్ (Dating) సాధారణమైన విషయమేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక డేటింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి వార్తే ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి బిందు మాధవి (Bindu Madhavi). చాలా కాలం తర్వాత రీసెంట్గా యాంగర్ టేల్స్ వెబ్ ప్రాజెక్ట్‌లో మెరిసింది. నవదీప్ నటించిన ఆహా ప్రాజెక్ట్ న్యూసెన్స్‌లో కూడా నటించింది. కొన్ని రోజులుగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్, వెబ్ సిరీస్‌లతో బిజీగా మారిపోయిన ఈ భామ డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.
ఇంతకీ ఈ బ్యూటీ డేటింగ్లో ఉన్నది ఎవరనే కదా మీ డౌటు. త్రిష మాజీ బాయ్‌ఫ్రెండ్ వరుణ్ మనియన్ (Varun Manian). ఇతడు బిజినెస్మెన్ మాత్రమే కాకుండా సినీ నిర్మాత కూడా. అయితే త్రిషతో రిలేషన్షిప్ ముగిసిన తర్వాతే వరుణ్ మనియన్తో తాను డేటింగ్ మొదలుపెట్టానని ఇటీవలే మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చింది బిందుమాధవి. అప్పట్లో రిలేషన్షిప్లో ఉన్న వరుణ్ మనియన్ -త్రిష పెళ్లికి కూడా ప్లాన్ చేసుకున్నారని తెలిసిందే. 2015లో వీరిద్దరి నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే ఆ తర్వాత ఎంగేజ్మెంట్ రద్దయింది.
మరోవైపు 2017లో వరుణ్ మనియన్-బిందు మాధవి మాల్దీవులు వెకేషన్ వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే తాను బిందుమాధవితో డేటింగ్లో లేనని, ఆమె మంచి ఫ్రెండ్ మాత్రమేనని అప్పట్లో చెప్పుకొచ్చాడు వరుణ్. కానీ ఇప్పుడు బిందుమాధవి స్వయంగా వారి రిలేషన్షిప్ విషయాన్ని బహిరంగంగానే చెప్పేసి హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరి రానున్న రోజుల్లో బిందుమాధవి-వరుణ్ మనియన్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలంటున్నారు మూవీ లవర్స్.
Anni Manchi Sakunamule | విందు భోజనంలా.. చెయ్యి చెయ్యి కలిపేద్దాం లిరికల్ వీడియో సాంగ్
OG Movie | పూణేలో ఫైట్ సీన్.. ఓజీ మూవీ క్రేజీ అప్డేట్
Adipurush | ప్రభాస్ ఆది పురుష్ ట్రైలర్ స్క్రీనింగ్ రద్దు.. కానీ