Biker | టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బైకర్ (Biker)’ విడుదల వాయిదా పడింది. అభిలాస్ కంకర దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుండగా, యువీ క్రియేషన్స్ నిర్మాణంలో చిత్రం రూపొందుతుంది. మూవీకి జిబ్రాన్ సంగీతం అందించారు. సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఈ సినిమాలో కీలకమైన స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో శర్వానంద్ అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ డిసెంబర్ 6న సినిమా విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేసినప్పటికీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం సినిమా రిలీజ్‌ను వాయిదా వేసే అవకాశాలు ఖాయం అయినట్టుగా తెలుస్తోంది. కారణం సినిమాలో భారీగా ఉన్న వీఎఫెక్స్ షాట్స్. ప్రస్తుతం ఇవి పూర్తిగా సిద్ధమవకపోవడంతో మూవీని వాయిదా వేశారు. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైస్ కాకుండా, మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ విడుదల తేదీని మార్చాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే రిలీజ్ పోస్ట్‌పోన్‌పై అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం సినిమా ఒక వారం వరకు వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ, కొత్త విడుదల తేదీపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
ఈ నిర్ణయంతో శర్వానంద్ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నప్పటికీ, మెరుగైన క్వాలిటీ కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. మరోవైపు డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న బాలకృష్ణ అఖండ 2తో కూడా పోటీ పడడం ఎందుకా అని కూడా కాస్త వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా శర్వానంద్‌కి సరైన సక్సెస్ లేదు. ఎంత హార్డ్ వర్క్ చేసిన కూడా సక్సెస్ రాకపోవడంతోఈ సారి బైకర్‌తో మంచి హిట్ కొట్టాలనే కసిమీద ఉన్నాడు శర్వా.