బిగ్‌బాస్ ఫేమ్ అజయ్ కతుర్వార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అజయ్ గాడు’. అజయ్‌కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై చందన కొప్పిశెట్టి టీమ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో సత్యదేవ్ విడుదల చేశారు. అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ ‘రాగాల 24గంటల్లో, అలాంటి సిత్రాలు తరువాత పలు చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించాను. ఇప్పుడు ఓ ఆసక్తికరమైన కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఈ చిత్రం హీరోగా నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.