Telugu Film Producers Council | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు (Single Screen Theatres) తాత్కాలికంగా మూతపడనున్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్లో పెద్ద సినిమాల విడుదలలేవి లేకపోవడం, ఓ వైపు సాధారణ ఎన్నికలు, మరోవైపు పక్క ఐపీఎల్ ఉండటంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకోవడంతో ఆ ఎఫెక్ట్ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లపై పడిందని… సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడంతో భారీ నష్టాలను చవిచూస్తున్న నేపథ్యంలో ఓ రెండు వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలు ఫేక్ అంటూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Telugu Film Producers Council) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఎన్నికలు, ఐపీఎల్ మేనియా కారణంగా తక్కువ వసూళ్లు రావడంతో కొందరు థియేటర్ యజమానులు థియేటర్లను మూసివేశారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు థియేటర్ల మూసివేతతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నామని ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెస్ నోట్..
సినిమాలు మూసివేతకు సంబంధించి pic.twitter.com/1GeP8aETiS
— Telugu Film Producers Council (@tfpcin) May 16, 2024