IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో రికార్డులు బద్ధలు కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కమిన్స్ సేన మూడో స్థానంతో ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది. వాన ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు ఇరుజట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దాంతో, 15 పాయింట్లతో కమిన్స్ సేన టైటిల్ పోరులో నిలిచింది.
సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసాన్ని కళ్లారా చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. గురువారం మధ్యాహ్నం 3:45 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసన వాన వేలాది మంది ఉత్సాహంపై నీళ్లు చల్లింది. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా చూద్దామనుకుని ఎంతో ఓపికగా ఎదురుచూశారు.
𝙎𝙪𝙣𝙧𝙞𝙨𝙚𝙧𝙨 𝙃𝙮𝙙𝙚𝙧𝙖𝙗𝙖𝙙 are through to #TATAIPL 2024 Playoffs 🧡
Which will be the final team to qualify 🤔#TATAIPL | #SRHvGT | @SunRisers pic.twitter.com/6Z7h5kiI4o
— IndianPremierLeague (@IPL) May 16, 2024
కానీ, 10:11 గంటలకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇరుజట్ల కెప్టెన్లు, కోచ్‌లను పిలిచి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పి ఒక్కో టీమ్‌కు ఒక్కో పాయింట్ ఇచ్చారు. దాంతో, ఆరెంజ్ ఆర్మీ 15 పాయింట్లతో నేరుగా ఫ్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఒక్క బంతి కాదు కదా.. కనీసం టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు ఉసూరుమంటూ ఇంటిదారి పట్టారు.
That 🆀 next to our logo looks gooood, doesn’t it #OrangeArmy? 😋🔥#PlayWithFire #SRHvGT pic.twitter.com/a0ZA5pqUwq
— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
ఉప్పల్ స్టేడియంలో 6:45కి వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో 8:00 గంటలకు టాస్ వేద్దామనుకున్నారు. తీరా ఆ సమయానికి మళ్లీ నేనొదలా అంటూ వరుణుడు స్టేడియాన్ని చుట్టుముట్టాడు. దాంతో, సిబ్బంది పరుగున వచ్చి పిచ్‌ను ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు. 8:30 గంటలకు మ్యాచ్ షురూ కాకపోవడంతో ఓవర్ల కోత మొదలైంది. ఒకవేళ 10:30కి గనుక మ్యాచ్ మొదలైతే కనీసం 5 ఓవర్ల ఆట ఆడిస్తారని ఫ్యాన్స్ ఊహించారు. అయితే.. దానిపై మ్యాచ్ రిఫరీగానీ, నిర్వాహకులుగానీ అధికారిక ప్రకటన చేయలేదు. దాంతో, మ్యాచ్ రద్దుకే మొగ్గు చూపుతారనే వార్తలు వినిపించాయి. అనుకున్నట్టుగానే అంపైర్లు గ్రౌండ్ క్యూరేటర్, అధికారులతో మాట్లాడి మ్యాచ్‌ను రద్దు చేశారు.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్
కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ ఈ సీజన్లో అదరగొట్టింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అదిరే ఆరంభాలు ఇవ్వగా మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్, మర్క్రమ్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిలు దంచికొట్టారు. ఆల్‌రౌండర్ షహ్బాజ్ అహ్మద్ సైతం మెరుపు బ్యాటింగ్‌తో అలరించగా.. బౌలర్లు భువనేశ్వర్, నటరాజన్, ఉనాద్కాట్లు ప్రత్యర్థుల భరతం పట్టారు. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)ను చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. గుజరాత్‌పై భారీ విజయంతో 16 పాయింట్లు సాధించాలనుకున్న హైదరాబాద్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు.