Kapil Sibal | సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో కపిల్ సిబాల్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కపిల్ సిబాల్‌కు 1066 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు లభించాయి. ఎస్సీబీఏ అధ్యక్ష పదవికి కపిల్ సిబాల్ ఎన్నికవ్వడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు 1995-96, 1997-98, 2001-02ల్లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ దఫా జరిగిన ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు.