Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 తాజా ఎపిసోడ్లో డ్రామా చోటు చేసుకుంది. కెప్టెన్సీ టాస్క్‌లో రీతూ చౌదరి, డీమాన్ కలిసి కళ్యాణ్‌ను గేమ్ నుండి తొలగించడంపై హౌస్‌లో యుద్ధ వాతావరణం అలముకుంది. “ఒకడి కష్టాన్ని దొబ్బడం కాదు.. నన్ను మోసం చేయలేదా.. ఇది మోసమే!” అంటూ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం, ఇంటి సభ్యులు మ్యూజిక్ వచ్చినప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉండాలి. అదే సమయంలో నామినేటెడ్ కంటెండర్స్ (కళ్యాణ్, రీతూ, రాము, ఇమ్మానుయేల్) ఎవరైనా డ్యాన్స్ చేసే సమయంలో గొడుగును రెడ్ స్క్వేర్ నుంచి బ్లూ స్క్వేర్‌కి తీసుకెళ్లి గేమ్‌లో కొనసాగాలి. డ్యాన్సర్లు గొడుగు పుష్ చేయడాన్ని అడ్డుకుంటే గేమ్ నిబంధనల ప్రకారం కంటెండర్లలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి.
స్టార్టింగ్‌లో కళ్యాణ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కనిపించిన రీతూ, గేమ్ మొదలయ్యే సమయానికి తన స్ట్రాటజీ మార్చింది. “కళ్యాణ్ ఉంటే నాకు కెప్టెన్సీ రాదు” అంటూ డీమాన్ చెవిలో ఊదింది. డీమాన్ అదే దిశగా సాగిపోయి మొదటి రౌండ్లోనే కళ్యాణ్‌ను రేసు నుంచి తొలగించాడు.కళ్యాణ్ ఆశ్చర్యానికి గురవుతూ, తన నమ్మకాన్ని చంపారనే భావనతో హౌస్‌లో మౌనంగా పోయాడు. రీతూ, డీమాన్ చేసిన నాటకంకి శ్రీజ కూడా సపోర్ట్‌గా ఉండటంతో, కళ్యాణ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. టాస్క్ ముగిసిన తర్వాత, రీతూ వచ్చి “సారీ” అన్నప్పటికీ కళ్యాణ్ తేలికగా తీసుకోలేదు. “నన్ను తీసేయమని నువ్వే అన్నావ్ కదా.. చెయ్ తీయ్!” అంటూ అసహనం వ్యక్తం చేశాడు. రీతూ ఎంతగా ఓదార్చినా, కళ్యాణ్ మాత్రం “నువ్వు నాకు ఫ్రెండ్ కాదు.. మోసం చేసింది నువ్వే!” అంటూ స్పష్టంగా చెబుతూ వెళ్ళిపోయాడు.
చివరికి కెప్టెన్సీ రేసులో రీతూ vs రాము మధ్య పోరు జరిగింది. భరణి టేబుల్‌కు వెళ్లి రాము సపోర్ట్ చేయడంతో, రీతూ గేమ్ నుంచి బయటికి వెళ్లిపోయింది. కెప్టెన్‌గా రాము రాథోడ్ ఎంపికయ్యాడు. ఈ ఫలితం రీతూకి పెద్ద షాక్‌గా మారింది. రౌండ్స్ అయ్యాక, నన్ను మోసం చేశావ్ అంటావా అందరి ముందు అంటూ రీతూ గట్టిగా రియాక్ట్ అయిన, కళ్యాణ్ మాత్రం స్ట్రాంగ్ గా నిలిచాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్లో నాగార్జున ఈ ఇష్యూపై ఎలా స్పందిస్తాడు అన్నది చూడాలి.