‘డీజే టిల్లు’ ఫేం విమల్‌కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా రూపొందుతున్న చిత్రానికి ‘అనుమాన పక్షి’ అనే పేరును ఖరారు చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హర్షచంద్ దండ్ నిర్మిస్తున్నారు.
దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. హీరో రాగ్ మయూర్ పాత్ర స్వభావాన్ని సూచించేలా ఈ టైటిల్, పోస్టర్ సాగాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్ నామా, సంగీతం: శ్రీచరణ్ పాకాల.