నందు, అవికాగోర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకుడు. సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. విభిన్న మనస్తత్వాలతో కూడిన పాత్రలు ఈ టీజర్లో కనిపిస్తున్నాయి.
టీజర్ ఆద్యంతం ట్విస్టులతో సాగింది. శివాజీరాజా, రవితేజ మహాదాస్యం, ప్రజ్ఞ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీసాయికుమార్ దారా, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్.